బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు.
హ్యాట్రిక్ కొట్టేందుకు అనిల్ రావిపూడితో కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు.
అయితే బాలకృష్ణ తదుపరి సినిమాకి సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో కలిసి బాలయ్య ఒక సినిమా చేయబోతున్నాడట.
ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండడం, శివరాజ్ కుమార్ కూడా ఇటీవల ఇతర ఇండస్ట్రీ హీరోల సినిమాలో నటిస్తుండడంతో..
ఇది నిజమే అయ్యి ఉండవచ్చు అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది అని సమాచారం.
ఇది ఇలా ఉంటే ఫిబ్రవరి 7న శివరాజ్ కుమార్ కొత్త మూవీ 'వేద' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య గెస్ట్‌గా వెళుతున్నాడు.