చలికాలంలో చాలామంది నువ్వుల నూనెను వంట నుంచి చర్మ సంరక్షణ వరకు, ఆలయంలో దీపాలు వెలిగించడానికి వాడుతారు. అలాగే జుట్టు సంరక్షణలో కూడా నువ్వుల నూనెను వాడొచ్చు.
నువ్వుల నూనెను జుట్టుకు అప్లై చేయడం వలన చుండ్రు లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందుకోసం నువ్వుల నూనెలో కొబ్బరి నూనెను మిక్స్ చేసి తరచుగా జుట్టుకు మసాజ్ చేస్తే చుండ్రు బారి నుంచి బయటపడవచ్చు.
జుట్టుకు మెరుపు కోసం నువ్వుల నూనెలో గ్లిజరిన్ మిక్స్ చేసి జుట్టుకు పట్టించి కొంత సమయం తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
నువ్వుల నూనెలో ఉండే Anti Oxident ఎలిమెంట్స్ తెల్ల జుట్టును తొలగించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం వారానికి రెండు నుంచి మూడు సార్లు నువ్వుల నూనెతో జుట్టుకు మసాజ్ చేయాలి.
Omega 3, Omega 6 తో పాటు నువ్వుల నూనెలో ఉండే కొవ్వు, ఆమ్లాలు జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి పనిచేస్తాయి. రోజూ నువ్వుల నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది.