విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్
ప్రియాంక జవల్కార్.
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్న ఈ భామ వైరల్ కామెంట్స్ చేసింది.
పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కోసం ఎంతోమంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు.
కానీ ఈ భామకి ఆ ఛాన్స్ వచ్చినా నో చెబుతాను అంటుంది.
ప్రియాంక జవల్కార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని.
పవన్ అభిమానిగా ఉంటే చాలు ఈ జన్మకి. అంతకు మించి ఏమి వద్దు అంటుంది.
పవన్‌ని దూరం నుంచి చూస్తూ.. ఒక అభిమానిలా ఆ ఆనందాన్ని అనుభవించడమే గొప్ప వరం.
అంతే గాని పవన్ పక్కన మాత్రం నటించను, నటించలేను అంటుంది.