ఒకేరోజు 16 తెలుగు సినిమాలని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్..
టాప్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గత కొన్ని రోజులుగా ఇండియాలో, రీజనల్ లాంగ్వేజెస్ లో పాగా వేయాలని బాగా ట్రై చేస్తుంది.
తాజాగా తెలుగు వారికి పెద్ద పండగ సంక్రాంతి కానుకగా ఒకేరోజు 16 తెలుగు సినిమాలని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది నెట్‌ఫ్లిక్స్.
చాలా వరకు ఇంకా షూటింగ్ దశలో ఉన్న సినిమాలతో ముందే ఒప్పందం కుదుర్చుకొని అవి థియేటర్ లో రిలీజ్ అయ్యాక నెట్‌ఫ్లిక్స్ లో విడుదల అవుతాయని ప్రకటించింది.
నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన సినిమాలు ఇవే..
చిరంజీవి భోళాశంకర్
కళ్యాణ్ రామ్ అమిగోస్
సందీప్ కిషన్ బడ్డీ
నాని దసరా
బుట్టబొమ్మ
రవితేజ ధమాకా
కార్తికేయ 8వ సినిమా
కిరణ్ అబ్బవరం మీటర్
నిఖిల్ 18 పేజెస్
నాగశౌర్య నెక్స్ట్ సినిమా
అనుష్క నెక్స్ట్ సినిమా
పంజా వైష్ణవ తేజ్ నెక్స్ట్ సినిమా
DJ టిల్లు 2
వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా
సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష
త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమా
నెట్‌ఫ్లిక్స్ ఒకేసారి 16 సినిమాలు అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులతో పాటు వేరే ఓటీటీ సంస్థలు కూడా ఆశ్చర్యపోతున్నారు.