మన ఇళ్లలో ఏవైనా పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటే మనం మొదటగా చేతులకు గోరింటాకు పెట్టుకుంటాం. తర్వాత ఆ మెహందీని తొలగించాల్సి వచ్చినప్పుడు చాలా మందికి కష్టంగా ఉంటుంది.

ఈ టిప్స్ వాడి చేతులకి ఉన్న మెహందీని పోగొట్టొచ్చు

ఆలివ్ నూనెలో రాక్ సాల్ట్ ను కరిగించి మీ చేతులకు ఆ నూనెను అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ చేతులను కడుక్కోవాలి. పూర్తిగా పోవడానికి ఆపై స్క్రబ్ క్రీంతో కడగాలి.

ఫేస్ స్క్రబ్బర్ తో బాగా స్క్రబ్ చేయటం వల్ల కూడా మెహందీ తొలగిపోతుంది. స్క్రబ్బింగ్ చేయటానికి ముందు మీ చేతులను గోరువెచ్చటి నీటిలో సుమారు పది నిమిషాలు పాటు నానబెట్టి ఆపై స్క్రబ్ చేయాలి.

చేతుల్లోని మెహందీ తొలగించేందుకు ఉప్పు ఉత్తమంగా పనిచేస్తుంది. కాబట్టి రాళ్ళ ఉప్పును నీటిలో కరిగించి అందులో చేతులను 15 నిమిషాల పాటు నానబెట్టి రుద్దితే మెహందీ తొలగిపోతుంది.

బేకింగ్ సోడాలో సగం నిమ్మరసం మిక్స్ చేసి మెహందీ ఉన్న ప్రదేశాలలో ప్యాక్ లాగా అప్లై చేసి పది నిమిషాల తర్వాత సబ్బుతో గోరువెచ్చటి నీటిలో చేతులు కడుక్కున్నా మెహందీ పోతుంది. 

నిమ్మరసం కూడా మెహందీని తొలగిస్తుంది. కాబట్టి నిమ్మరసాన్ని నేరుగా చేతులకి రాసుకున్నా లేదా నీళ్ళల్లో  పిండుకొని అందులో ఇరవై నిమిషాలు చేతులు ఉంచినా మెహందీ పోతుంది.