హీరోయిన్ మృణాల్ ఠాకూర్ 'సీతారామం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సీతగా కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసిన మృణాల్‌ని కొందరు తనని పిచ్చిది అని అన్నారని తెలియజేసింది.
హీరోయిన్గా కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో 'పిప్పా' సినిమాలో హీరో ఇషాన్ ఖట్టర్‌కి సోదరిగా నటిస్తుంది మృణాల్.
కథ నచ్చడంతో ఒకే చెప్పేశా. కానీ అది ఒప్పుకున్నందుకు నన్ను అందరూ పిచ్చిదాని, తెలివితక్కువదాని అంటూ కామెంట్స్ చేశారు.
అయితే ఈ హీరోయిన్ ఇంతకుముందు హిందీ జెర్సీ మూవీలో తల్లి పాత్రలో నటించింది.
ప్రస్తుతం తెలుగులో నాని 30వ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది.
ఈ సినిమాలో కూడా తల్లి పాత్రలోనే కనిపించబోతుందని తెలుస్తుంది.