సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దులు కూతురు 'సితార' సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేసింది.
10 ఏళ్ళ వయసు ఉన్న సితార.. సోషల్ మీడియాలో చేసే అల్లరి మాములుగా ఉండదు.
పండుగ సమయంలో ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో 1M ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
అంతేకాదు దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తుంటది.
తన తండ్రి మహేష్ బాబు పాటలకి స్టెప్పులు వేసిన వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తుంటది.
తాజాగా సితార హీరోయిన్ రేంజ్‌లో చేసిన ఫోటోషూట్ చూసి, అందరూ ఫిదా అయిపోతున్నారు.