కిరణ్ అబ్బవరం 'మీటర్' అనే సినిమాతో ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ మూవీ ప్రమోషన్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీలో సందడి చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఒక కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయిన కిరణ్ అబ్బవరం..

పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పవన్ కళ్యాణ్ గారితో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా.

అంతా అనుకున్నట్లు జరిగితే ఒక మల్టీస్టారర్‌తో మీ ముందుకు వస్తా అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందా? లేదా కిరణ్ అబ్బవరం మాటలు వరుకే ఉండిపోతుందా? చూడాలి.